"మెట్రో"లో మరిన్ని ప్రత్యేక రాయితీలు..!

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 05:29 PM


హైదరాబాద్, మార్చి 11 : మెట్రో ప్రయాణికులను ఆకర్షించే విధంగా రాయితీలు ప్రకటించాలని "హైదరాబాద్ మెట్రో" యోచిస్తోంది. ఈ విషయంపై ప్రతిపాదనలన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ ముందుంచింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పండగ వేళలైన.. దసరా, దీపావళి, రాఖీపౌర్ణమి, బోనాలు, జనవరి 26, ఆగస్టు 15, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మెట్రో ప్రారంభ దినోత్సవం, గాంధీ జయంతి ఇలా ప్రత్యేక రోజుల్లో రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై ఎల్‌అండ్‌టీ స్పష్టత ఇవ్వకుండా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే మెట్రో ప్రయాణికులకు స్మార్ట్‌కార్డులపై 10 శాతం రాయితీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మరిన్ని రాయితీలు అందిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆలోచనలో పడ్డారు.

Untitled Document
Advertisements