ఇకపై రైల్వే టికెట్లను బదిలీ చేయవచ్చు..

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 05:55 PM

ఇకపై రైల్వే టికెట్లను బదిలీ చేయవచ్చు..

న్యూఢిల్లీ, మార్చి 11 : రైలులో చాలా మంది సౌకర్యవంతంగా ప్రయాణించడానికి టికెట్లను బుక్ చేసుకుంటారు. కాని చివరి నిమిషంలో వారి ప్రయాణం క్యాన్సిల్ అవుతుంటుంది. అలాంటప్పుడు తమ టికెట్లను వేరే వారికి బదిలీ చేసుకునే సౌలభ్యాన్ని రైలేశాఖ ప్రకటించింది. టికెట్‌ను బదిలీ చేయదలచుకొన్న వ్యక్తి తన ప్రయాణానికి 24 గంటల ముందుగానే రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. సదరు ప్రయాణికుడు పెళ్లి బృందానికి చెందినవాడైతే, అతని టికెట్‌ను ఆ పెళ్లి బృంద నాయకుడు రాతపూర్వకంగా తెలియజేయాలి.

విద్యా సంస్థకు చెందిన విద్యార్థి అయితే సదరు విద్యా సంస్థ అధినేత అనుమతిని ఆ విద్యార్థి పొందాల్సి ఉంటుంది. నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌(ఎన్‌సీసీ) కి సైతం ఈ వెసలుబాటును కల్పించారు. ప్రయాణికుడి సీటు లేదా బెర్తును మరొకరి పేరుపై బదిలీ చేయడానికి ముఖ్యమైన రైల్వేస్టేషన్ల ప్రధాన రిజర్వేషన్‌ పర్యవేక్షకుడికి ఈ అధికారం ఉంటుంది. కుటుంబ సభ్యులోని తల్లి, తండ్రి, తోబుట్టువు, పిల్లలు, భార్య లేదా భర్త ఎవరికైనా టికెట్లు బదిలీ చేసుకోవచ్చు.

Untitled Document
Advertisements