ఆ ప్రదర్శన నవశకానికి నాంది : అభినవ్‌ బింద్రా

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 06:27 PM

ఆ ప్రదర్శన  నవశకానికి నాంది : అభినవ్‌ బింద్రా

న్యూఢిల్లీ, మార్చి 11: మెక్సికోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచకప్‌ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఇండియా అవకాశాలు సృష్టించుకుంది. యువ ఆటగాడు అఖిల్‌ షెరాన్‌ పురుషుల 50 మీటర్ల రైపిల్‌ 3 పొజిషన్‌ పోటీలో ఈ రోజు స్వర్ణ పతకం గెలిచాడు. దీంతో ఇప్పటి వరకు భారత్‌ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలను సాధించింది. షహజర్ రిజ్వీ, మను భకర్‌, మెహుల్‌, అంజుమ్‌ ముద్గిల్‌ భారత్‌ ప్రధమస్థానంలో నిలిపారు.

ఈ సందర్భంగా బింద్రా మాట్లాడుతూ.." మెక్సికో ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన నవశకానికి నాంది. ఒలింపిక్‌ పోడియంపై తొలిస్థానంలో నిలిచే సత్తా మన యువ క్రీడాకారులకు ఉంది. ప్రపంచకప్‌ విజేతలకు అభినందనలు. పతకాలు సాధించి మన దేశ ప్రతిష్టను మరింత పెంచిన జూనియర్‌ జట్టు కోచ్‌లకు, సహాయక సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. వారి ఎనలేని కృషికి ఫలితమే నేటి పతకాలు" అని ఆయన వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements