ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కాసుల పంట..!

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 12:08 PM

ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కాసుల పంట..!

ముంబై. మార్చి 12 : బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఐపీఎల్ ఫ్రాంఛైజీల కు కాసుల వర్షం కురిపించనుంది. ఆదాయ ఆర్జనలో బీసీసీఐకు సింహభాగంగా నిలిచిన ఐపీఎల్ టోర్నీలోని ఎనిమిది మంది ఫ్రాంఛైజీలు ఇక నుండి ఏటా తలో రూ.250 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం. ఇందుకు కారణం వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్‌ ప్రసార హక్కుల్ని ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ అయిన స్టార్‌ స్పోర్ట్స్‌ ఏకంగా రూ.16,347 కోట్లకు పాడుకుంది.

ఈ నేపధ్యంలో బోర్డుకు ప్రసార హక్కుల ద్వారా ఏటా రూ.3200 కోట్లు అందుతాయి. గతంలో సోనీ టీవీ ద్వారా ఏడాదికి రూ. 800 కోట్లు మాత్రమే రావడంతో ఒక్కో ఫ్రాంఛైజీ రూ.60 కోట్లు మాత్రమే పొందేది. ఇది ఇప్పుడు నాలుగు రెట్లు పెరగడం విశేషం.





Untitled Document
Advertisements