దర్శకేంద్రుడి సినిమాలో విక్టరీ మల్టీస్టారర్..!

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 12:29 PM

దర్శకేంద్రుడి సినిమాలో విక్టరీ మల్టీస్టారర్..!

హైదరాబాద్, మార్చి 12 : 'దర్శకేంద్రుడు' అనగానే అందరికి పూలు, పండ్లతో అలంకరించి చిత్రీకరించిన పాటలే గుర్తొస్తుంటాయి. అందాన్ని తీర్చిదిద్దడంలో అతని శైలే వేరు. ఆధ్మాత్మిక చిత్రాలను సైతం ఎంతో రమణీయంగా చూపించి మెప్పించగల సత్తా ఒక్క రాఘవేంద్రుడికే సాధ్యం. ఇందుకు నిదర్శనంగా 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడీ సాయి', 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలను చెప్పుకోవచ్చు.

తాజాగా 'దర్శకేంద్రుడు' మరో ఆధ్యాత్మిక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారట.

వెంకటేశ్‌-రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 'కలియుగ పాండవులు', 'భారతంలో అర్జునుడు', 'కూలీ నెంబర్‌ వన్‌', 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. సునీల్‌ దర్శకేంద్రుడి పలు చిత్రాలలో కమెడియన్ గా నటించారు. ప్రస్తుతం హీరోగా మారిన సునీల్ ఈ సినిమాలో కమెడియన్‌గానే నటిస్తారా.? లేక కీలక పాత్రలో నటిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements