మహానీయులు స్ఫూర్తి ప్రదాతలు..

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 12:54 PM

మహానీయులు స్ఫూర్తి ప్రదాతలు..

అమరావతి, మార్చి 12 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభను పురస్కరించుకొని ఎందరో మహనీయులను స్పూర్తిగా తీసుకొని ఒక వీడియోను రూపొందించారు. "మన మహనీయులు స్ఫూర్తి ప్రదాతలు.. అందుకోండి మా ప్రణామాలు" అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 49 మంది మహనీయుల చిత్రాలను ఆ వీడియోలో పొందుపరిచారు.

అంతేకాకుండా జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు అంటూ 14 మార్గదర్శకాలను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అందులో క్రమశిక్షణను పాటించి ప్రజలతో గొడవ పెట్టుకోవద్దని, అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని.. పార్టీ హోదాను నిలబెట్టాలని అలాగే ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే ఈ నెల 14 వ తేదీన గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా టోల్ ప్లాజా సమీపంలో జరగనుంది.

Untitled Document
Advertisements