స్టార్ హీరోలతో "డీజే" భామ..!

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 02:10 PM

స్టార్ హీరోలతో

హైదరాబాద్, మార్చి 12 : 'దువ్వాడ జగన్నాథం' సినిమా అంతగా విజయం సాధించకపోయిన పూజా హెగ్డేకి మాత్రం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే 'ముకుంద' సినిమాతో పరిచయమైన పూజాకి మొదట్లో అంతగా ఆఫర్లే రాలేదు. కాని 'దువ్వాడ జగన్నాథం' తర్వాత ఆమెకి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా ఎంపికైంది.

వంశీ పైడిపల్లి .. మహేష్ ల సినిమాకు సైతం ఈ అమ్మడునే తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ప్రభాస్ 'సాహో' తరువాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ చిత్రంలోను పూజా హెగ్డేనే ఎంపికైందని సమాచారం. ఇలా వరుస అవకాశాలతో దూకుడు మీద ఉన్న పూజా.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements