సాంకేతికతే సాధనంగా..

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 02:40 PM

సాంకేతికతే సాధనంగా..

కర్ణాటక, మార్చి 12 : కర్ణాటకలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమరం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ కసరత్తులను మొదలపెట్టాయి. ఇందుకోసం రాజకీయ పక్షాలు సాంకేతికతను సాధనంగా ఉపయోగించుకొని సమాచార సాంకేతిక సిబ్బందిని ఓటర్లుగా మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ ను పడగొట్టి అధికారం చేజిక్కుంచుకోవాలన్న కమల దళం ఈ విషయంలో ముందంజలో ఉంది.

తొలుత నుండి సోషల్ మీడియను విరివిగా వాడి ఓటర్లను ప్రభావితం చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే తరహా పంథాను అనుసరించాలని చూస్తుంది. బెంగుళూర్ ను 'సిలికాన్ వ్యాలీ' గా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ఐటీ ఉద్యోగుల ఓటు బ్యాంకుగా గుర్తించకపోవటం ఆ పార్టీకు పెద్దదెబ్బ. మరోవైపు జేడీఎస్‌ సాంకేతికతవైపు ఇప్పుడిప్పుడే అడుగులేస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు జరిగే ఈ ఎన్నికల కోసం ప్రతి ఒక్క ఓటు ఒక విలువైనది కనుక ప్రతి పార్టీ టెక్నాలజీని ఆయుధంగా చేసుకొని ప్రచారం సాగిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.





Untitled Document
Advertisements