కోమటిరెడ్డిపై దాడి దుర్మార్గం : తలసాని

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 02:55 PM

కోమటిరెడ్డిపై దాడి దుర్మార్గం : తలసాని

హైదరాబాద్, మార్చి 12 : శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాడి చేయడం దుర్మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం చేస్తుండగా కాంగ్రెస్ సభ్యులు ఇలా అమానుషంగా ప్రవర్తించడం సరికాదంటూ ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ సభ్యులు పథకం ప్రకారమే చేశారంటూ దుయ్యబట్టారు. కోమటిరెడ్డిపై చట్టపరంగా తీసుకోవాలంటూ తలసాని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పథకాలన్ని చూసి కాంగ్రెస్ నేతలకు నోట మాట రావడం లేదంటూ విమర్శలు చేశారు.

Untitled Document
Advertisements