జేసీపై చంద్రబాబు సెటైర్..!

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 03:25 PM

జేసీపై చంద్రబాబు సెటైర్..!

అమరావతి, మార్చి 12 : అమరావతిలో అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా తనను కలవడానికి వచ్చిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు.. "బడి(పార్లమెంట్)ఎగ్గొడితే ఫెయిలవుతారు" అని సెటైర్ వేశారు. ఈ విషయంపై జేసీ స్పందిస్తూ.. "తాను ఎప్పుడూ ఫెయిల్‌ కానని బడి ఎగ్గొట్టి బ్యాక్ బెంచ్ లో కూర్చున్న వారు స్థానానికి ఎదిగారు" అంటూ జవాబిచ్చారు. అనంతర౦ మీడియాతో మాట్లాడిన జేసీ.. తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

Untitled Document
Advertisements