విషాదయానం..!

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 04:04 PM

విషాదయానం..!

ఖాట్మండు, మార్చి 12 : నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ విమాన ప్రయాణం కాస్త విషాదయానంగా మారింది. ఉన్నట్టుండి యూఎస్‌ బంగ్లాకు చెందిన విమానం ఖాట్మండులోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కుప్పకూలిపోయింది. బంగ్లాదేశ్‌ నుంచి సుమారు 78 మంది ప్రయాణీకులతో వస్తోన్న విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో విమానం కుప్పకూలిపోయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అక్కడి ఆర్మీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 17 మందిని అధికారులు కాపాడగలిగారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Untitled Document
Advertisements