“T-SAT నిపుణ”లో ఐఐటీ తరగతులు..!

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 04:43 PM

“T-SAT నిపుణ”లో ఐఐటీ తరగతులు..!

హైదరాబాద్, మార్చి 12 : డిజిటల్ యుగం వైపు దూసుకుపోతున్న ప్రపంచానికి ధీటుగా విద్యార్థులను తీర్చి దిద్దాలని తెలంగాణ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. సంకల్పానికి ప్రతి రూపంగా ఈ "T-SAT" రూపుదిద్దుకుంది. ఈ "T-SAT నిపుణ" ప్రపంచాన్ని అనుసంధానం చేసే విధంగా చదువుతో పాటు, మానసిక వికాసానికి సంబంధించిన అంశాలపై అవగాహన కలిగించడమే ధ్యేయంగా పని చేస్తోంది.

ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా.. మార్చి 13 నుండి "T-SAT నిపుణ", "విద్యా"లలో ఎంసెట్, నీట్, ఐఐటీ ల కోసం కోచింగ్ తీసుకునే విద్యార్థులకు తరగతులను ప్రసారం చేయనుంది. ఇందులో భాగంగా నిపుణులతో సుమారు 500 గంటల పాటు క్లాసులను నిర్వహించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.





Untitled Document
Advertisements