ఈ ఏడాది అదరగొట్టనున్న సమంతా

     Written by : smtv Desk | Mon, Mar 12, 2018, 04:45 PM

ఈ ఏడాది అదరగొట్టనున్న సమంతా

చెన్నై, మార్చి 12 : గతేడాది తెలుగు, తమిల్ లో కలిపి కేవలం రెండు సినిమాలతోనే వచ్చిన సమంతా అక్కినేని ఈ ఇయర్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. అటు తమిల్ లోను ఇటు తెలుగులోను కలిపి ఏకంగా అరడజను సినిమాలు 2018లో విడుదల కానున్నవి.

తమిళంలో శివ కార్తికేయన్ సరసన 'సీమరాజా' అనే సినిమాలో నటిస్తుంది. తమిళ దర్శకుడు పొన్ రామ్ తెరకేక్కించబోతున్న ఈ సినిమా కామెడీ ఎంటటైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివలే సమంతా తన షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ట్విట్టర్ వేదికగా సమంతా ఈ సంవత్సరం తనకు చాలా ఇచ్చిందని.. చాలా గర్వంగా, సంతోషంగా ఉందని.. ఈ చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పింది. ప్రస్తుతం సమంతా తెలుగులో నటించిన 'రంగస్థలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Untitled Document
Advertisements