ఉగాదికి పట్టలెక్కనున్న నాగ్‌-నాని సినిమా

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 11:50 AM

ఉగాదికి పట్టలెక్కనున్న నాగ్‌-నాని సినిమా

హైదరాబాద్, మార్చి 12 : 'శమంతకమణి' దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమాలో అక్కినేని నాగార్జున .. నాని కలసి నటిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానెర్ లో వస్తున్న ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 18న ఉగాది సందర్భంగా సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ సినిమాకి సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నాడు. ప్రస్తుతం పాటలకు సంభందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అమెరికాలో జరుగుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Untitled Document
Advertisements