"కిరాక్ పార్టీ" కిర్రాక్ ప్రమోషన్స్..

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 01:01 PM


హైదరాబాద్, మార్చి 12 : హీరో నిఖిల్ విభిన్న అంశాలున్నా కథలను ఎంచుకుంటూ వరుస హిట్ లను కొడుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ 'కిరాక్ పార్టీ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అయిన 'కిరిక్ పార్టీ' చిత్రాన్ని దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తెలుగులో 'కిరాక్ పార్టీ' పేరుతో రీమేక్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో నిఖిల్ తన ట్విట్టర్ లో సినిమా ప్రమోషన్ల భాగంగా పలు కళాశాలలకు సందర్శించడానికి 'కిరాక్ పార్టీ' టీం బస్సులో వెళ్తునట్లు.. వచ్చే స్టాప్ తిరుపతి అని సూచిస్తూ.. రోడ్డు మధ్యలో వాళ్ళు దిగిన ఫోటను షేర్ చేశారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Untitled Document
Advertisements