కనీస నిల్వలపై ఛార్జీలు తగ్గించిన ఎస్‌బీఐ..

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 01:32 PM

కనీస నిల్వలపై ఛార్జీలు తగ్గించిన ఎస్‌బీఐ..

న్యూఢిల్లీ, మార్చి 13 : దేశంలో అతి పెద్ద బ్యాంకుగా పేరొందిన స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త తెలియజేసింది. గతేడాది నుండి ఎస్‌బీఐ వినియోగదారుల పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే మెట్రో, అర్బన్ ప్రాంతాలలో నెలకు రూ.50 చొప్పున అలాగే, సెమీ-అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారుల నుండి నెలకు 40 వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎస్‌బీఐ ఈ ఛార్జీలను 75 శాతం వరకు తగ్గించింది.

దీంతో ఇక నుండి మెట్రో, అర్బన్‌ ప్రాంతాల్లో కనీస నిల్వలు లేకపోతే రూ. 15 చొప్పున, సెమీ-అర్బన్‌ అయితే రూ. 12, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాలకైతే రూ. 10చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1, 2018 నుండి సవరించిన ఛార్జీలను అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఎస్‌బీఐ కనీస నిల్వలు లేకపోతే ఆర్జించే వ్యయం రూ. 1,771 కోట్లలో ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఛార్జీలను తగ్గిస్తూ ఎస్‌బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.





Untitled Document
Advertisements