టీఆర్ఎస్ ఎంపీ కవితకు మోదీ సర్ ప్రైజ్..

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 03:04 PM

టీఆర్ఎస్ ఎంపీ కవితకు మోదీ సర్ ప్రైజ్..

హైదరాబాద్, మార్చి 13 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.. 39వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తెలుగులో లేఖ రాసి పంపించారు. ఆ లేఖలో "జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలను స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా మీకు కావలసిన ఆరోగ్య, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా" అంటూ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ప్రభుత్వ విధివిధానాలలో తప్పులను తెలుపుతూ.. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం కోసం తన వంతుగా కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రధాని.. ఎంపీ కవితను ఇలా అభినందించడం విశేషం.

Untitled Document
Advertisements