అస్వస్థతకు గురైన బిగ్ బీ

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 03:44 PM

అస్వస్థతకు గురైన బిగ్ బీ

ముంబై, మార్చి 13 : బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్య కారణంగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ప్రస్తుతం బిగ్ బీ 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్' చిత్రంలో నటిస్తున్నారు. రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. వెంటనే జోధ్‌పూర్‌ లోని హాస్పిటల్ లో చేర్చారు. ఇంకా మెరుగైన చికిత్సను అందించడం కోసం ముంబై నుండి వైద్య బృందం ప్రత్యేక విమానంలో జోధ్‌పూర్‌ చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బీ ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు తెలిపారు. యష్ రాజ్ ఫిలిం బ్యానెర్ లో వస్తున్న 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్' చిత్రంలో పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వలన నటులు శారీరకంగా చాలా కష్టపడాల్సింటుంది. బహుషా వాటి ప్రభావం అమితాబ్ పై చూపిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

Untitled Document
Advertisements