దెబ్బకు దెబ్బ..! ప్రతీకారం తీర్చుకున్న నక్సల్స్..

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 04:00 PM

దెబ్బకు దెబ్బ..! ప్రతీకారం తీర్చుకున్న నక్సల్స్..

ఛత్తీస్‌గడ్‌, మార్చి 13 : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల జరిగిన కాల్పుల్లో పది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా మావోయిస్టులు నేడు అదును చూసి ప్రతీకారం తీర్చుకున్నారు. సుక్మాలోని కిస్టారమ్-పేలోడి రోడ్‌లో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 9 మంది సీఆర్‌పీఎప్ జవాన్లు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదయం నక్సల్స్ సరిహద్దు ప్రాంతంలో కాల్పులు జరిపి పారిపోయారు. వారి కోసం జవాన్లు కూంబింగ్ నిర్వహి౦చే క్రమంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో 9 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Untitled Document
Advertisements