ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ చేస్తున్న 'ఆది పినిశెట్టి'..

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 04:34 PM

ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ చేస్తున్న 'ఆది పినిశెట్టి'..

హైదరాబాద్, మార్చి 13 : విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించి, ప్రతినాయక పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ కథానాయకుడు ఆది పినిశెట్టి "రంగస్థలం" చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, సమంత నాయక నాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి కి సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఆది రామ్ చరణ్ కు అన్నగా నటిస్తున్నట్లు సమాచారం.

అయితే తాజాగా విడుద‌లైన ఈ పోస్టర్ లో రంగ‌స్థ‌లం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా లాంతరు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అంటూ రాసి ఉంది. అనగా ఈ చిత్రంలో ఆది ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ చేసే పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్పటి పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి.

Untitled Document
Advertisements