సీఎం కేజ్రీవాల్‌ సలహాదారు రాజీనామా

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 04:54 PM

సీఎం కేజ్రీవాల్‌ సలహాదారు రాజీనామా

న్యూఢిల్లీ మర్చి 13: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సలహాదారు వీకే జైన్‌ రాజీనామా చేశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, అరవింద్‌ కేజ్రీవాల్‌కు సన్నిహితులు, సలహాదారు అయిన వీకే జైన్‌ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై దాడి చేసిన ఘటనలో జైన్‌ ప్రధాన సాక్షిగా ఉండడంతో, పోలీసులు జైన్‌ను ప్రశ్నించారు. అనంతరం కొద్ది రోజులకే ఆయన రాజీనామా సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. . ఆయన రాజీనామా పత్రాన్ని కేజ్రీవాల్‌కు, మరో కాపీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల్హ ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

Untitled Document
Advertisements