కత్తి మహేష్ కు దిమ్మతిరిగే కౌంటర్..!

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 05:16 PM

కత్తి మహేష్ కు దిమ్మతిరిగే కౌంటర్..!

హైదరాబాద్, మార్చి 13 : గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ కు మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కొంత కాలంగా సంయమనం పాటించిన మహేష్ మళ్లీ పవన్‌పై కత్తి దూయడం మొదలు పెట్టారు. ఈ గొడవలోకి రచయిత విజయ నగేష్ సీన్‌లోకి ప్రవేశించారు. మహేష్ ఎన్ని కామెంట్లు పోస్ట్ చేసినా వాటికి ధీటుగా ఎన్‌కౌంటర్ రేంజ్‌లో నగేష్ రిప్లై ఇవ్వడం మొదలు పెట్టారు.

తాజాగా కత్తి మహేష్.. "జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజురి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం" అంటూ ట్వీట్ చేశారు. ఈ విషమ౦పై స్పందించిన నగేష్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

“వినాశకాలే విపరీత ట్వీట్లు. మిడిసిపాటుకు తప్పదు భంగపాటు. ఈ ఉన్మాదానికి పాడాలి చరమగీతం. వేలకోట్ల జగన్ అవినీతి కనిపించని వైసీపి కత్తిమహేశ్ కి జనసేన విషయంలో అవినీతికి ఆధారం చూపిన మరుక్షణం నా ట్విట్టర్ ఎకౌంట్ డిలీట్ చేస్తా.. కత్తి అనుచరుడిగా మారిపోతా" అంటూ మెరుపు వేగంతో రిప్లై ఇచ్చారు. మహేష్ ట్వీట్లకు మెరుపు వేగంతో స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు నగేష్.

Untitled Document
Advertisements