ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీంకోర్టు

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 06:14 PM

ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మార్చి 13 : ఆధార్ కార్డ్ అనుసంధాన౦పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధాన౦ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వ తేదీ వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆధార్‌ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించే వరకు ఆధార్ తప్పనిసరంటూ బలవంతం చేయడం తగదని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొ౦ది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలకు ఆధార్ తప్పని సరైంది. దీంతో సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయంపై స్పందించిన సుప్రీంకోర్టు తాజాగా ఈ ఆదేశాలను వెలువరించింది.

Untitled Document
Advertisements