మరో పాటతో 'కృష్ణార్జున యుద్ధం'

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 07:09 PM

మరో పాటతో  'కృష్ణార్జున యుద్ధం'

హైదరాబాద్, మార్చి 13 : నాచ్యురల్ స్టార్ నాని ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నటిస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలోని పాటలను సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు, రెండు పాటలకు మంచి స్పందన లభించడంతో ప్రేక్షకులలో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా మరో పాటను విడుదల చేయబోతున్నట్టు నాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. హిప్పోప్ టమిజ సంగీతం అందించిన ఈ సినిమాలోని "ఉరిమే మనసే" అనే పాటని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. శైన్ స్క్రీన్ బ్యానెర్ పై సాహు గరపటి, హరీష్ పెద్దిలు కలసి నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్షర్ మీర్ లు నానితో రోమాన్స్ చేయనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Untitled Document
Advertisements