రాజీనామా చేయడానికి ఎమ్మెల్యేలంతా సిద్దం..!

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 11:30 AM

రాజీనామా చేయడానికి ఎమ్మెల్యేలంతా సిద్దం..!

హైదరాబాద్, మార్చి 14 : ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్ చేసిన విషయంపై రాష్ట్రపతిని కలుస్తామని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే సంపత్ తో పాటు 48 గంటల పాటు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి.. తానూ గజ్వేల్ లో పర్యటించిన౦దుకే కేసీఆర్ తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారన్న ఆయన కాంగ్రెస్‌ పెద్దలను కలిసి పరిస్థితిని వివరిస్తామని తెలిపారు. నాకు పదవులు గడ్డి పోచతో సమానం అంటూ.. పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో పోటీచేసి గెలిచి చూపిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ నేత సంపత్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్‌పై హైకోర్టుకు వెళ్తా౦. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.

Untitled Document
Advertisements