ఓటమి బాధించింది : విరాట్‌

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 12:23 PM

ఓటమి బాధించింది : విరాట్‌

ముంబయి, మార్చి 14 : ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) లో సెమీఫైనల్లో చెన్నయిన్‌ జట్టు ఎఫ్‌సీ గోవా జట్టుపై చెన్నయిన్‌ 3-0 తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరింది. అంతకుముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి అంచె సెమీఫైనల్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

ఈ ఓటమిపై జట్టు సహా యజమాని, విరాట్ కోహ్లి మాట్లాడుతూ.." సెమీఫైనల్లో ఓటమి నన్ను బాధించింది. ఈ సీజన్‌ బాగానే కొనసాగింది. టోర్నీలో ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. కంగ్రాట్స్‌ " అని పేర్కొన్నాడు.

ఐఎస్‌ఎల్‌లో ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజమాని అయిన కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటన నుండి వచ్చిన అనంతరం గోవా జట్టు నూతన జెర్సీని ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు.

Untitled Document
Advertisements