మూగవాడు అయిపోతున్న నారా రోహిత్

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 02:55 PM

మూగవాడు అయిపోతున్న నారా రోహిత్

హైదరాబాద్, మార్చి 14 : టాలీవుడ్ హీరోలంతా తమిళ దర్శకుడు బాలా ఫార్ములానే ఫాలో అవుతున్నారు. బాలా చిత్రాలలో కథను నడిపించే కథానాయకుడికి ఏదో ఒక లోపాన్ని జోడించి సినిమా తెరకెక్కిస్తారు. ఆ ఫార్ములా ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ లా మారింది. నిన్నటికి నిన్న రవితేజ 'రాజా ది గ్రేట్' సినిమాలో అంధునిగా నటించి హిట్ కొట్టాడు. 'రంగస్థలం' సినిమాతో రామ్ చరణ్ వినికిడి లోపంతో రంగంలోకి దిగనున్నాడు. తాజాగా ఇదే కోవలో మరో హీరో చేరనునట్లు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదండి నారా రోహిత్. మంజునాథ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించే సినిమాలో నారా రోహిత్ పూర్తిస్థాయి మూగవానిగా కనిపించనున్నాడు. అట్లూరి నారాయణరావు నిర్మించే ఈ సినిమా నారా రోహిత్ నటించిన 18వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Untitled Document
Advertisements