తెలంగాణ వినాశనానికి కాంగ్రెస్ కారణం..

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 03:01 PM

తెలంగాణ వినాశనానికి కాంగ్రెస్ కారణం..

హైదరాబాద్, మార్చి 14 : శాసనసభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మధ్య కొందరు ప్రతిపక్ష నేతలు పనిగట్టుకొని మరి మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న అప్పులపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి. ఆ వార్తలలో వాస్తవం లేదు. ఇలా ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయవని, ప్రతి పైసాపై ఆర్బీఐ నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

"ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణలో కలిపింది.. తెలంగాణ ఉద్యమ సమయంలో 400 మందిని పొట్టనపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని విభజించొద్దని హైకమాండ్‌ను కోరింది కాంగ్రెస్‌ నేతలు కాదా? అలాంటివారు నేడు తెలంగాణను ఇచ్చింది మేమేనంటూ చెప్పుకుంటూ తిరగడం వింతగా ఉంది. అంతేకాదు నాటి నుండి నేటికి తెలంగాణ వినాశనానికి కారణం కాంగ్రెస్సే. ప్రతిపక్ష నేతల కోరిక మేరకు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహిస్తామని చెప్పిన వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే ఎలా".? అంటూ నిలదీశారు.

Untitled Document
Advertisements