ట్యాంక్‌బండ్‌పై నిరసనలు బంద్ : కేసీఆర్

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 03:45 PM

ట్యాంక్‌బండ్‌పై నిరసనలు బంద్ : కేసీఆర్

హైదరాబాద్, మార్చి 14 : ఇక మీదట ట్యాంక్‌బండ్‌పై నిరసనలు, ధర్నాలు ఉండకుండా నిషేధించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ధర్నాచౌక్‌లో ఆందోళనలు నిషేధిస్తామన్న ఆయన.. ఆ నిషేధాజ్ఞలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినవని తెలిపారు.

ఈ మేరకు శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఆనాడు చంద్రబాబు హయాంలో నిషేధాజ్ఞలు తీసుకువచ్చారు. అనుమతి లేకున్నా, కోర్టు వద్ద ధర్నాలు చేస్తామంటే తాము అనుమతించాం. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఆందోళనలు చేస్తామంటే సహించేది లేదు.

మంచి పద్ధతిలో శాంతియుతంగా ధర్నాలు, ర్యాలీలు చేయాలన్న కేసీఆర్.. అనుమతి లేకుండా నిరసనలు చేపట్టడం తగదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యబద్దంగా ఉందని ఉద్ఘాటించారు.

Untitled Document
Advertisements