మాజీ కెప్టెన్ గా దుల్కర్ సల్మాన్..!

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 04:01 PM

మాజీ కెప్టెన్ గా దుల్కర్ సల్మాన్..!

ముంబై, మార్చి 14 : అభిషేక్ శర్మ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ జంటగా 'జోయ ఫాక్టర్' సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను సోనమ్ కపూర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'జోయ ఫాక్టర్' అనేది అనుజ్ చౌహాన్ రాసిన ఒక నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ నవలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సోనమ్ వెల్లడించింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్.. భారత క్రికెటర్ మాజీ కాప్టెన్ నిఖిల్‌ ఖొడ పాత్రలో నటించనుండగా, యాడ్‌ ఏజెన్సీలో పనిచేసే జోయా సింగ్‌ సోలమ్ పాత్రలో సోనమ్‌ కనిపించనున్నారు. పోస్టర్ లో దుల్కర్, సోనమ్ లు కలసి 'జోయ ఫాక్టర్' నవల పుస్తకాన్ని చదువుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

Untitled Document
Advertisements