సోషల్ మీడియా పెను సవాల్ : హోంమంత్రి

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 05:39 PM

సోషల్ మీడియా పెను సవాల్ : హోంమంత్రి

న్యూఢిల్లీ, మార్చి 14 : ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా పెద్ద సవాలుగా మారిందంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంత అంతర్జాతీయ పోలీస్‌ చీఫ్‌ల సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ఆన్‌లైన్ నేరాలను నియంత్రించడానికి పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారిందన్నారు. ఇటీవల ఉగ్రవాదులు సైతం, తమ తమ కార్యకలాపాలను సోషల్ మీడియా వేదికగా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

ఇందుకోస౦ పోలీసింగ్ వ్యవస్థ, పౌరులు సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. ఆ మధ్య 2013లో ఉత్తరప్రదేశ్ లో అల్లర్లు జరుగుతున్నాయంటూ వచ్చిన ఓ తప్పుడు ప్రచారం వల్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి తప్పుడు ప్రచారాల చేస్తూ.. ఐసిస్‌ ఉగ్రవాదులు సోషల్‌ మీడియా ద్వారానే యువతను ఆకర్షిస్తున్నారని.. పోలీసులు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.

Untitled Document
Advertisements