జనసేన ఆవిర్భావ సభలో అపశృతి..

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 05:58 PM

జనసేన ఆవిర్భావ సభలో అపశృతి..

అమరావతి, మార్చి 14 : జనసేన ఆవిర్భావ సభలో గందరగోళం నెలకొంది. కార్యకర్తలంతా అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి సభకు జనసేన కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. వారిని అదుపుచేసేందుకు భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని నిలువరించలేక లాఠీచార్జ్ చేశారు. ఈ ధాటికి బారికేడ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పదిమంది జనసేన కార్యకర్తలతో పాటు, పలువురు పోలీసులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభను గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటు చేశారు.





Untitled Document
Advertisements