శ్రీరెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 07:09 PM

శ్రీరెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్, మార్చి 14 : 'అరవింద్2' సినిమా ఫేమ్ శ్రీరెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు అమ్మాయిలకి అందం లేదా.? ఎక్స్ పోజ్ చేయట్లేదా.? ఎందుకు ముంబై, కర్ణాటక, మలయాళం, తమిళ అమ్మాయిలనే హీరోయిన్ గా పెట్టుకుంటారు.? సినీ పరిశ్రమలో అమ్మాయిలు పడుకుంటేనే పని అవుతుందని, తెలుగు అమ్మాయిలు వాటికి అంగీకరించరు. కొందరు పడుకున్నా అవకాశాలు కష్టమని వాపోయారు.

కొందరు అమ్మాయిలైతే అవకాశాలు రాక పోట్టనింపుకోవడం కోసం వ్యభిచారంలోకి దిగుతున్నారని, కొందరు మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని వెల్లడించింది. టాలీవుడ్ ను ఏలుతుంది కేవలం నాలుగైదు కుటుంబాలేనని వారు తప్ప బయటివారు నిలదొక్కుకునే అవకాశం లేదన్నారు. తెలుగు అమ్మాయిలకు సినీ పరిశ్రమలో చోటు లేదని.. తెలుగు అమ్మాయిలకు సినిమాలలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.





Untitled Document
Advertisements