పరిశోధనలు దేశాభివృద్దికి దోహదపడాలి: మోదీ

     Written by : smtv Desk | Sat, Mar 17, 2018, 12:30 PM

పరిశోధనలు దేశాభివృద్దికి దోహదపడాలి: మోదీ

ఇంఫాల్, మార్చి 16: పరిశోధనలను దేశాభివృద్ధికి దోహద పడేలా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశాభివృద్ధి కోసం పరిశోధనలను పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమయిందని ఉద్ఘాటించారు. 105వ సైన్స్ కాంగ్రెస్ సదస్సును శుక్రవారం ఇంఫాల్ లో మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త అంశాలను వెలుగులోకి తేవడంలోనూ, శాస్తస్రాంకేతిక విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలోనూ భారత్‌కు ఘనమైన సంప్రదాయక నేపథ్యం ఉందని తెలిపారు. ఈ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న దేశాల మధ్య భారత్ మళ్లీ తన స్థానాన్ని సంతరించుకునేలా పరిశోధనలు జరగాలని, వాటి ఫలాలు ప్రజలకు అందాలని ప్రధాని అన్నారు. దేశ ప్రగతి, సంపద సృష్టికి అవసరమయ్యే విధంగా టెక్నాలజీలను వినియోగించుకునే విషయంలో భారత దేశం భవిష్యత్ అవసరాలకు సిద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements