"భరత్ అనే నేను" మాట.. రికార్డుల వేట..!

     Written by : smtv Desk | Sat, Mar 17, 2018, 01:24 PM


హైదరాబాద్, మార్చి 17 : సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న "భరత్ అనే నేను" చిత్ర టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ కు అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. వీడియో విడుదల చేసిన 24 గంటల్లోనే 11.5 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ పొంది రికార్డు సృష్టించింది. టాలీవుడ్‌లోనే అత్యధిక౦గా లైకులు దక్కించుకున్న టీజర్ గా ఈ చిత్రం నిలవడం విశేషం.

మహేష్.. ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తు౦డగా.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 20న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు "భరత్ అనే నేను" చిత్ర టీజర్ ను యూట్యూబ్‌లో 532000 మంది లైక్‌ చేయగా, 13 మిలియన్ల మంది వీక్షించారు.

Untitled Document
Advertisements