ఆయన పెద్ద సూపర్ స్టార్.. : అమీర్‌ ఖాన్

     Written by : smtv Desk | Sat, Mar 17, 2018, 06:01 PM

ఆయన పెద్ద సూపర్ స్టార్.. : అమీర్‌ ఖాన్

ముంబై, మార్చి 17 : "రజని పెద్ద సూపర్ స్టార్.. ఆయనతో పోటీ అస్సలు తట్టుకోలేము" అని ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. తమిళ తలైవా రజనీ.. నటించిన "2.ఓ" చిత్రం విడుదల తేదీని చిత్రబృంద౦ ఇంకా ఖరారు చేయలేదు. బహుశా ఈ దీపావళికి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తుండడంతో అమీర్.. ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది. "2.ఓ" చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా.. ఇదే సమయానికి బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ నటిస్తున్న "థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌" విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ.. "'2.ఓ' మా సినిమాతో పాటు విడుదల కాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ ఇదే జరిగితే మాకు పెద్ద సమస్య ఎదురవుతుంది. రజనీ చాలా పెద్ద స్టార్‌. ఆయనంటే నాకు చాలా గౌరవం, ఇష్టం" అంటూ పేర్కొన్నారు. "థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌"లో అమీర్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, నటిస్తున్నారు. నవంబరు 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.





Untitled Document
Advertisements