యాక్షన్.. రియాక్షన్

     Written by : smtv Desk | Sat, Mar 17, 2018, 06:03 PM

యాక్షన్.. రియాక్షన్

కొలంబో, మార్చి 3 : శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య నిన్న ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ-20 ఫైనల్ అర్హత మ్యాచ్ లో రచ్చ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్రీడాస్పూర్తిని దెబ్బతీస్తూ ప్రవర్తించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌, రిజర్వ్‌ ప్లేయర్‌ నురుల్‌ హసన్‌ల చేసిన యాక్షన్ పై అంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి (ఐసీసీ) జరిమాన విధించింది.

మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా ఓ డీమెరిట్‌ పాయింట్‌ ను కేటాయించింది. ఇక ఈ ఉత్కంఠకర మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్‌ ఓ బంతి మిగిలి ఉండగానే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌- బంగ్లాదేశ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Untitled Document
Advertisements