పండుగలను భారత్‌-పాక్‌ వివాదాల్లోకి లాగొద్దు..!!

     Written by : smtv Desk | Mon, Mar 19, 2018, 12:26 PM

పండుగలను భారత్‌-పాక్‌ వివాదాల్లోకి లాగొద్దు..!!

ముంబై, మార్చి 19 : ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమి.. పాక్ నెటిజన్ పై మండిపడ్డారు. భారతదేశంలో ఉగాది పండగ సందర్బంగా అద్నాన్ సమి ట్విటర్ వేదికగా 'అందరికీ గుడీ పడ్వా శుభాకాంక్షలు' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్వీట్‌ చూసిన ఓ పాక్‌ నెటిజన్‌ 'రంజాన్‌ నాడు మాకు విష్‌ చేయడం మర్చిపోరని ఆశిస్తున్నాను' అని కామెంట్ చేశాడు.

ఆగ్రహానికి గురైన అద్నాన్‌.. 'రంజాన్‌ నీ ఒక్కడి పండుగే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ముస్లింల పండుగ. పండుగలను భారత్‌-పాక్‌ వివాదాల్లోకి లాగొద్దు. పాకిస్థాన్‌లో కంటే భారత్‌లోనే చాలా మంది ముస్లింలు ఉన్నారు' అని సమాధానమిచ్చారు. విశేషమేమిటంటే నిజానికి అద్నాన్‌ సమి ఓ పాకిస్థానీ. 2016లో ఆయనకు భారతీయుడిగా పౌరసత్వం లభించింది.

Untitled Document
Advertisements