ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల..

     Written by : smtv Desk | Mon, Mar 19, 2018, 06:03 PM

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల..

అమరావతి, మార్చి 19 : ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు ఈ సాయంత్రం విడుదలయ్యాయి. టెట్‌ ఫలితాలను విజయవాడలోని గేట్‌ వే హోటల్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.10 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.

గతంలో విడుదల చేసిన ప్రాథమిక కీ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలు వెలువడగా.. పలు ప్రశ్నలకు మార్కులను కలుపుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితాల కోసం cse.ap.gov.in లేదా aptet.apcfss.in లలో సంప్రదించండి.





Untitled Document
Advertisements