మధ్యాహ్న భోజన పథకం పై నిఘా: కడియం

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 11:15 AM

మధ్యాహ్న భోజన పథకం పై నిఘా: కడియం

హైదరాబాద్, మార్చి 22: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో జరుగుతున్న అవకతవకల నియంత్రణ కోసం నిరంతరం నిఘా పెడుతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. అందుకోసం విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన పేర్కొన్నారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కడియం సమాధానం ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం (2018-19) నుంచే తెలుగుభాషను ఒకటి నుంచి పదోతరగతి వరకు తప్పనిసరి బోధనాంశంగా అమలుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం కడియం తెలిపారు

Untitled Document
Advertisements