ఫేస్‌బుక్‌ అంశం పై బీజేపీకి రాహుల్‌ కౌంటర్‌

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 12:41 PM

ఫేస్‌బుక్‌ అంశం పై బీజేపీకి రాహుల్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ, మార్చి 22: ఫేస్‌బుక్‌ సమాచారం లీకేజీ కుంభకోణంపై ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఉద్దేశ పూర్వకంగా ఈ అవాస్తవపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పైకి తీసుకొచ్చిందని అన్నారు. ఇరాక్‌లో 39మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఆ విషయంలో కేంద్రం వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ అవాస్తవపు ఆరోపణలు చేస్తుందంటూ ట్విటర్‌ ద్వారా రాహుల్ తెలిపారు.

Untitled Document
Advertisements