ఊర్మిళా రీఎంట్రీ పై వర్మ ట్విట్.. !!

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 02:21 PM

ఊర్మిళా రీఎంట్రీ పై వర్మ ట్విట్.. !!

ముంబై, మార్చి 22 : 1990లో కుర్రకారును ఉర్రూతలూగించిన 'రంగీల' బ్యూటీ ఊర్మిళ మతోండ్కర్ పదేండ్ల తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కథానాయకుడగా నటిస్తున్న 'బ్లాక్‌మెయిల్‌' చిత్రంలో 'బేవఫా బ్యూటీ' అనే ఐటమ్ సాంగ్ లో మెరిశారు. ఈ పాటను చిత్రబృందం సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ఇందులో ఊర్మిళ మునుపటిలాగే అందంగా కనిపిస్తున్నారు. కాగా.. ఈ వీడియోను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ట్వీట్‌ చేశారు. ఊర్మిళ రీఎంట్రీపై ఆనందం వ్యక్తం చేశారు. 'వావ్‌.. 'రంగీలా' భామ ఇప్పటికీ అంతే అందంగా ఉంది. ఫరెవర్‌ గ్రీన్‌ ఊర్మిళను ఈ పాటలో చూశారా' అంటూ వీడియోను షేర్ చేశారు. అభినయ్‌ డియో దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Untitled Document
Advertisements