సల్మాన్ హీరోయిన్ కి భోజ్పురి హీరో సాయం.. !!

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 03:18 PM

సల్మాన్ హీరోయిన్ కి భోజ్పురి హీరో సాయం.. !!

ముంబై, మార్చి 22 : క్షయ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకుపోరాటం చేస్తున్న హీరోయిన్ పూజా దడ్వాల్‌ కు భోజ్పురి హీరో రవి కిషన్ సాయం చేశారు. అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్ ఆమె పరిస్థితి గురించి తెలుసుకొని.. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి తన స్నేహితుడు ఉదయ్ భగత్ ద్వారా.. చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు. ప్రియ పరిస్థితిని వివరిస్తూ ఉదయ్‌ భగత్ ఓ వీడియోను‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 1990ల్లో వచ్చిన 'వీర్‌ఘటి' చిత్రంలో పూజా సల్మాన్‌ ఖాన్‌కి జోడీగా నటించారు. పూజ 1997లో వచ్చిన 'తుమ్సే ప్యార్ హో గయా' చిత్రంలో రవికిషన్‌తో కలిసి నటించారు.





Untitled Document
Advertisements