'రంగస్థలంలో' చిన్నారుల సందడి..

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 06:48 PM

'రంగస్థలంలో' చిన్నారుల సందడి..

హైదరాబాద్, మార్చి 22 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో చరణ్ సరసన సమంతా కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన లభించడంతో సగటు ప్రేక్షకుడిలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినీబృందం ఈ సినిమాలోని 'రంగా రంగా రంగాస్తలానా..' పాట మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే అర్థమౌతుంది రామ్ చరణ్ కు చిన్న పిల్లల ఫాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో. అక్కడైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే జనాలు వెళ్లి చూడటం సహజమే కానీ.. 'రంగస్థలం' షూటింగ్ చూడటానికి ఎక్కువగా పిల్లలు చరణ్ బ్యానర్లు పట్టుకొని వచ్చి వారి వీరాభిమానాన్ని చాటుకున్నారు. అలా వచ్చిన వారితో చరణ్ సరదాగా గడపడం, సినిమా చిత్రీకరణ లాంటి విశేషాలను ఈ వీడియోలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యామాలలో షికారు చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది.





Untitled Document
Advertisements