షమీకి ఊరట..

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 07:03 PM

షమీకి ఊరట..

ముంబై, మార్చి22 : టీమిండియా క్రికెట్ పేసర్ మహ్మద్ షమీకి ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా తన భార్య హాసిన్ జహాన్ చేసిన తీవ్ర ఆరోపణల మధ్య సతమతమైన అతనికి బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. పేసర్ షమీ ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌లకు పాల్పడలేదని తేల్చింది. ఈ మేరకు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం చీఫ్ నీరజ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో బోర్డు అతని కాంట్రాక్టును మళ్లీ పునరుద్దరించడమే కాకుండా, వచ్చే నెల 7 నుండి జరిగే ఐపీఎల్ లో పాల్గొనేందుకు మార్గం సుగమం చేసింది. షమీ ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements