భాజపాకు నాగం గుడ్‌బై

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 07:08 PM

భాజపాకు నాగం గుడ్‌బై

హైదరాబాద్, మార్చి 22‌: బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మెయిల్‌ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం గురువారం రాజీనామా లేఖను పంపారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలపై తాను పోరాడుతున్నానని, అయినా తనకు బీజేపీ ఏమాత్రం సహకరించడం లేదని నాగం ఈ సందర్భంగా మండిపడ్డారు. అందుకే బీజేపీకి రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తానని ఆయన తెలిపారు.





Untitled Document
Advertisements