దూసుకువస్తున్నా 'టాక్సీవాలా'..

     Written by : smtv Desk | Fri, Mar 23, 2018, 06:23 PM

దూసుకువస్తున్నా 'టాక్సీవాలా'..

హైదరాబాద్, మార్చి 23 : విజయ దేవర కొండ హీరోగా, రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'టాక్సీవాలా'. 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ యువ కథానాయకుడు నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం 'టాక్సీవాలా ఫస్ట్‌ గేర్‌' పేరుతో విడుదల చేసింది.



ఫుల్‌ జోష్‌తో టాక్సీలో దూసుకెళ్తున్న విజయ్‌ లుక్కు, జేక్స్‌ బెజోయ్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో విజయ్‌ క్యాబ్‌ డ్రైవర్‌పాత్రలో పోషించగా.. మాళవికా నాయర్‌, షార్ట్‌ ఫిలింస్‌ బ్యూటీ ప్రియాంక జవల్కర్‌ల హీరొయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌కేఎన్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.





Untitled Document
Advertisements