తేనె వల్ల కలిగే ప్రయోజనాలు..

     Written by : smtv Desk | Sun, Mar 25, 2018, 05:11 PM

తేనె వల్ల కలిగే ప్రయోజనాలు..

హైదరాబాద్, మార్చి 25 : తేనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మన శరీరానికి తేనె తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంది. మనం కూడా రోజు వారి తేనెను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా..!

* ఒక టీ స్పూన్ నిమ్మరసంలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి.
* తేనెను, దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద చ‌ల్లుకుని తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
* రోజూ గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు టీస్పూన్ల తేనె కలుపుకుని తాగితే బ‌రువు త‌గ్గుతుంది.
* నిమ్మ‌ర‌సంలో తేనె క‌లుపుకుని తాగితే క‌డుపు ఉబ్బ‌రం, ఆయాసం త‌గ్గుతాయి.
* తేనెలో మిరియాల పొడి క‌లుపుకుని తీసుకుంటే జ‌లుబు మాయ‌మ‌వుతుంది.
* రాత్రిపూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ తేనె క‌లుపుకుని తాగితే నిద్రలేమి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది.
* గాయాలు, పుండ్లు, చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఆయా భాగాల్లో కొంత తేనె రాస్తూ ఉంటే వెంట‌నే వాటి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
* కీళ్ళనొప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనె, రెండు వంతుల నీరు, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని రాస్తే నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది.





Untitled Document
Advertisements