రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం..53 మంది మృతి

     Written by : smtv Desk | Mon, Mar 26, 2018, 01:22 PM

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం..53 మంది మృతి

రష్యా, మార్చి 26: సైబీరియా రాష్ట్రం కెమెరోవో పారిశ్రామిక నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపింగ్‌ మాల్‌లో జరిగిన ప్రమాదంలో 53 మంది మృతి చెందినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా మీడియా తెలిపిన వివరాల ప్రకారం..కెమెరొవోలోని వింటర్‌ చెర్రీ షాపింగ్‌ సెంటర్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ సెంటర్‌లో మల్టిప్లెక్స్‌ సినిమా థియేటర్లు, స్పా, బౌలింగ్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా షాపింగ్‌ సెంటర్‌లో మంటలు ఎగసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు షాపింగ్‌మాల్‌ అంతా వ్యాపించాయి. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు





Untitled Document
Advertisements