నకిలీ వార్తలపై ఉక్కుపాదం మోపనున్న మలేషియా..

     Written by : smtv Desk | Mon, Mar 26, 2018, 03:07 PM

 నకిలీ వార్తలపై ఉక్కుపాదం మోపనున్న మలేషియా..

కౌలాలంపూర్‌, మార్చి 26 : నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తుంది.. ఈ మాట ప్రస్తుతం ఈ తరానికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సామాజిక మాధ్యమాల పుణ్యమని నకిలీ వార్తలు దావానంలా వ్యాప్తి చెందుతున్నాయి. కాగా వీటికి అడ్డుకట్ట వేసే దిశగా మలేషియా ప్రభుత్వం అడుగులేసింది. తప్పుడు వార్తలు రాసి ప్రజలను గందరగోళానికి గురి చేసే వారిపై ఉక్కుపాదం మోపనుంది. నకిలీ వార్తలు రాసేవారికి, ప్రచారం చేసేవారికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా అక్కడి ప్రభుత్వం తయారు చేసింది.

ఈ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మలేషియా ప్రధాన మంత్రి నజీబ్‌ రజాక్‌ ఇప్పటికే తనపై అవినీతి ఆరోపణలు చేస్తోన్నవారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్లు జైలు శిక్ష లేదా 5,00,000 రింగిట్‌లు (దాదాపు 84 లక్షల రూపాయలు) జరిమానా విధించనున్నారు. వచ్చే ఆగస్టులో జరిగే ఎన్నికల్లో గెలుపోందడానికే రజాక్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements